ఎన్నారైలకోసం సరికొత్త ట్యాక్స్ రిఫండ్ ఎస్టిమేటర్ ప్రారంభించిన ప్రవాసీటాక్స్
- October 27, 2021
ట్యాక్స్ సంబంధిత విషయాలపై సరైన అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యంగా కారణంగా ఒక్కోసారి ఇబ్బందికర పరిస్థితుల్లో ట్యాక్స్ కన్సల్టెంట్ల వద్దకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఎన్నారైలలో చాలామంది టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టడ్ ఎట్ సోర్స్) పొందవచ్చునన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవాసీ ట్యాక్స్ డాట్ కామ్(http://www.pravasitax.com), ఎన్నారైలకోసం ట్యాక్స్ రిఫండ్ ఎస్టిమేటర్ టూల్ అందుబాటులోకి తెచ్చింది. యూజర్ ఫ్రెండ్లీ విధానంలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆయా వ్యక్తుల ఆదాయం, పన్నులు, వంటి అంశాలకు లోబడి టీడీఎస్ ఎంత.? అనేది ఈ టూల్ ద్వారా తెలుసుకోవడానికి వీలుంది. బ్యాంకులు అత్యధిక మొత్తంలో వసూలు చేసే అవకాశం వున్నందున, ఈ టూల్ ద్వారా, తమ డిపాజిట్లకు సంబంధించి టీడీఎస్ సహా, రిఫండ్ వివరాల్ని సవివరంగా తెలుసుకుని అప్రమత్తమవ్వచ్చు. ప్రవాసీ ట్యాక్స్ సీఈఓ శ్రీజిత్ కునియిల్ ఆలోచనల్లోంచి పుట్టింది రిఫండ్ అప్లికేషన్. చార్టెడ్ అక్కౌంటెంట్ల గ్రూప్ ఈ ప్రవాసీ టాక్స్ రూపకల్పనలో కీలక భూమిక పోషించింది.
తాజా వార్తలు
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!