ఏపీ రాజధాని అమరా వతిలో ప్రపంచ స్థాయి హైకోర్టు

- March 19, 2016 , by Maagulf
ఏపీ రాజధాని అమరా వతిలో ప్రపంచ స్థాయి హైకోర్టు

న్యాయసదస్సులో సీఎం చంద్రబాబు అవిశ్వాసంలో న్యాయస్థానాలే కీలకం పెండింగ్‌ కేసులు పరిష్కరించాలి: టీ.సీఎం కేసీఆర్‌ఏపీ రాజధాని అమరా వతిలో ప్రపంచ స్థాయి హైకోర్టును నిర్మిస్తున్నట్లు ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రకటించారు. న్యాయమూర్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలను, మౌలిక సదుపాయాలను కల్పించేం దుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొ న్నారు. రెండు రోజుల రాష్ట్రస్థాయి న్యాయమూర్తులు, న్యాయాధికారుల సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులు ధర్మాసనాలు ఇచ్చే తీర్పులు సమాజానికి మార్గదర్శకాలుగా నిలుసా ్తయని పేర్కొన్నారు. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఫైబర్‌ గ్రిడ్‌ను ప్రారంభించామని ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తొలివిడత ఫైబర్‌నెట్‌వర్క్‌ పూర్తిచేశామని చెప్పారు.మిగతా 10జిల్లాల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నామని ఆయన ప్రకటించారు.రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక భారం ఉన్నా అనేక వినూత్న పథకాలకు, కార్యక్రమాలకు తమ ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు. 320కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నా మని చెప్పారు. కేవలం 149రూపాయలతో టెలిఫోన్‌, 100టీవీ ఛానల్స్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం ప్రతి ఇంటికి కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13జిల్లాల్లో ఫైబర్‌ నెట్‌వర్క్‌ను కల్పించేందుకు రూ.5వేల కోట్లు కావాలని అంచనా వేయగా తాము కేవలం 320కోట్ల రూపాయల తోనే ఈ పనిని పూర్తి చేస్తున్నామని చెప్పారు.ఈ సౌకర్యం వల్ల నవ్యాంధ్రలో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చని ఆయన చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని అనేక నూతన పథకాలకు శ్రీకారం చుట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానంలో చైనా దేశం వైపు అందరు చూసేవారని ప్రస్తుతం భారత్‌వైపు చూస్తున్నా రని త్వరలోనే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో భారతదేశం అగ్రగామిగా కానుందని ఆయన చెప్పారు. తాను అభివృద్ధి చేస్తున్న డిజిటల్‌ మీడియా ద్వారా భవిష్యత్తులో న్యాయవ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలన్ని ఆన్‌లైన్‌ లోనే పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పారు. సాంకేతికత పరిజ్ఞానంలో 2050సంవత్సరం నాటికి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా కానుందని ఆయన తెలిపారు.ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించినప్పుడు న్యాయ స్థానాల పాత్ర కీలకంగా ఉంటుందని తెలంగాణ ముఖ్య మంత్రి చంద్రశేఖర్‌రావు అభిప్రాయ పడ్డారు. న్యాయ స్థానాలు త్వరితగతిన తీర్పులను వెలువరిస్తే కక్షిదారులకు న్యాయస్థానాలపై విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. దేశపురోభివృద్ధిలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని ఆయన తెలిపారు. ఎవరికి వారు సమర్థ వంతంగా పనిచేస్తుండడం వల్లే దేశం అన్ని రంగాల్లో అభి వృద్ధి సాధి స్తోందని ఆయన పేర్కొన్నారు. రెండు రోజుల రాష్ట్రస్థాయి న్యాయమూర్తులు, న్యాయాధికారుల సదస్సు శనివారం ప్రారంభమైంది. ఇందులో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.దిగువ న్యాయస్థానాల్లో దాదాపు 5లక్షల వరకు కేసులు పరిష్కారం కాకుండా మిగిలిపోయా యని వీటి పరిష్కారానికి న్యాయమూర్తులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెం డింగ్‌లో ఉన్న 35శాతం కేసులను శీఘ్రగతిన పరిష్కరించేం దుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక శ్రద్ధ తీసు కున్నారని చెప్పారు. న్యాయం కోసం సామాన్యులు న్యాయ స్థానాలను ఆశ్రయిస్తారని వారికి పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వవలసిన ఆవశ్యకత న్యాయ మూర్తులపై ఉందని చెప్పా రు. న్యాయస్థానాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాల్సిన అవ సరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ రెండు రోజుల సదస్సును నిర్వహించి ప్రజలకు మంచి సందేశం ఇస్తున్నం దుకు తాను అభినందిస్తున్నానని పేర్కొన్నారు.న్యాయ మూర్తులు, న్యాయాధికారులు ఒకచోట కూర్చుని సత్వర న్యాయం ఎలా అందించాలనే అంశంపై చర్చించడం హర్షణీ యమని కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రజా స్వామ్యంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకమని ఈ వ్యవస్థపై ప్రజలు నమ్మకం, విశ్వాసం పెట్టుకున్నారని అందుకు అనుగుణంగా పనిచే యాల్సిన అవసరం న్యాయవ్యవస్థలో ఉన్న వారందరిపై ఉందని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. న్యాయ మూర్తులు ఎప్పటి కప్పుడు అవగాహన పెంచుకునేందుకు ఈ తరహా సదస్సులు ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు. సదస్సుల నిర్వహణ పట్ల తమకు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందని దీనికి తోడు న్యాయ రంగంలో తీసుకువస్తున్న సంస్క రణలు చేపట్టాల్సిన మార్పులపై ఈ సదస్సు పూర్తి స్థాయిలో చర్చిం చాలని ఆయన కోరారు.ఉమ్మడి హైకోర్టులో 2.72లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసు కుంటే బాగుంటుందో ఈ సదస్సు చర్చించి తగు నిర్ణయం తీసుకోవా లని తాను కోరారు. కక్షిదారులు వ్యక్తిగత స్వేచ్ఛతో న్యాయం జరుగుతుందనే విశ్వాసంతో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని చెప్పారు. న్యాయమూర్తులు ఎంత సమర్థవంతంగా పనిచేస్తే ప్రజలకు అంత న్యాయం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించేందకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. చర్చోపచర్చల వల్ల ఆశించిన ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రమణ మాట్లా డుతూ న్యాయసేవ సమాజ సేవలాంటిదని అన్నారు. న్యాయం ఎక్కడ ఉంటుందో విజయం కూడా అక్కడే ఉంటుందని ఇది భగవత్‌గీతలో స్పష్టం చేశారని ఆయన పేర్కొన్నారు. న్యాయం అందించడంలో పేదలు, ధనికులు అన్న తారతమ్యం ఉండదని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రశేఖర్‌రావు, చంద్రబాబు నాయు డులు మంచి విజయంతో పనిచేస్తున్నారని కొనియాడారు. మాతృబాషా, మాతృభూమిని ఎప్పటికీ మరవకూడదంటూ గుర జాడ సూక్తులను చదివి వినిపించారు. తెలుగు రాష్ట్రాల న్యాయాధి కారుల సదస్సులో పాలుపంచుకోవడం సంతోష కరంగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సామాజిక పరిస్థితులు ఒక్కటేనని అన్నారు.మరో సుప్రీం కోర్టు న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా మాట్లాడుతూ మానసి కంగా, ధృడంగా ఉంటే భౌతికంగా, ధృడంగా ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. న్యాయాధికారులు, న్యాయ మూర్తులు లక్ష్యాలను నిర్ధేశించుకుని ఆ లక్ష్యాల సాధనకు, వాటిని చేరుకునేందుకు ప్రయత్నించారని ఆయన హితవు పలికారు. ఒకరి నొకరు ఆలోచనలు పంచుకోవడం ద్వారా బాధ్యతలను గుర్తె రుగవచ్చని అన్నారు. ఈ సదస్సులో గుజరాత్‌ రాష్ట్రా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుభాష్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్‌ బోసాలే స్వాగ తోపన్యాసం చేస్తూ రాష్ట్రం విడిపోయాక న్యాయాధికారుల సదస్సులను నిర్వహించడం ఇదే ప్రధానమని చెప్పారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దావే నేతృత్వంలో న్యాయస్థానాల కంప్యూట రీకరణ విజయవంతమైందని పేర్కొన్నారు.ఈ న్యాయాధికారుల సదస్సులో ఎన్నో అంశాలు చర్చకు రానున్నాయని ఈ రంగంలో విష్ణాతులైనవారు ప్రసంగించనున్నారని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో మూడు మాసాలకొకసారి న్యాయమూర్తులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని దీని ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. న్యాయవాదులకు ఎస్‌ఎమ్‌ఎస్‌ల ద్వారా ఎప్పటికప్పుడు కోర్టుల సమాచారం అందిస్తున్నామని, పైలెట్‌ పద్ధతిన ఈ కోర్టును ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ కార్య క్రమానికి హైకోర్టు న్యాయమూర్తి చంద్రయ్య వందనసమర్పణలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com