రిస్క్ ఎక్కువ ఉన్న వారికి మూడో డోస్ కూడా. ప్రభుత్వం నుంచి గ్నీన్ సిగ్నల్

- October 29, 2021 , by Maagulf
రిస్క్ ఎక్కువ ఉన్న వారికి మూడో డోస్ కూడా. ప్రభుత్వం నుంచి గ్నీన్ సిగ్నల్

మస్కట్ :  కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ చాలా మందికి పాజిటివ్ వస్తున్న సంగతి తెలిసిందే. రెండు డోసులు తీసుకున్న వారికి కూడా ఇంకా కరోనా ముప్పు పొంచే ఉందని హెల్త్ ఎక్స్ ఫర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూరైనప్పటికీ రిస్క్ ఉంది. దీంతో రిస్క్ ఎక్కువ ఉన్న గ్రూప్ లకు మూడో డోస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వం నియమించిన సుప్రీం కమిటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రిస్క్ ఉన్న ప్రత్యేక గ్రూప్ ల వారికి త్వరలోనే మూడో డోస్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా 5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 1 తారీఖు నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుందని హెల్త్ మినిస్ట్రీ అధికారులు తెలిపారు. తల్లితండ్రులు తప్పకుండా పిల్లలందరికీ వ్యాక్సినేషన్ ఇప్పించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.  

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com