వ్యాక్సినేషన్ లెక్కల్లో గందరగోళం. క్లారిటీ ఇచ్చిన హెల్త్ మినిస్ట్రీ
- October 29, 2021_1635481840.jpg)
ఒమన్: వ్యాక్సినేషన్ లెక్కలో నెలకొన్న గందరగోళంపై ఒమన్ హెల్త్ మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చింది. సుల్తానేట్ లో దాదాపు పది లక్షల మంది వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉండగా వారికి ఇప్పటికీ వ్యాక్సినేషన్ చేయలేదని స్థానిక లోకల్ రేడియోలో న్యూస్ వచ్చింది. దీంతో గందరగోళం నెలకొంది. ఈ విషయం హెల్త్ మినిస్ట్రీ దృష్టికి వెళ్లటంతో అసలు లెక్కలను పూర్తి గణంకాలతో వివరించింది. పదిలక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందన్న వార్తల్లో వాస్తవం లేదని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 3,071,161 మంది కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపింది. వీరిలో 94 శాతం మంది ఒమన్ కు చెందిన వారేనని ప్రకటించింది. అదే విధంగా రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు 87 శాతం ఉన్నట్లు లెక్కలతో సహా వివరించింది. ఇందులో 94 శాతం మంది ఒమన్ పౌరులేనని స్పష్టం చేసింది. దాదాపు 79 శాతం మందికి రెండు డోస్ ల వ్యాక్సినేషన్ పూర్తైందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సినేషన్ లెక్కల్లో ప్రజలను కన్ ఫ్యూజ్ చేయవద్దని మీడియాకు సూచించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..