'అనుభవించు రాజా' విడుదల తేదీ ఖరారు
- October 31, 2021హైదరాబాద్: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ నెక్స్ట్ కామెడీ ఎంటర్టైనర్ “అనుభవించు రాజా”. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ జూదగాడిగా, బాధ్యత తెలియని యువకుడిగా, కేవలం లైఫ్ ను ఎంజాయ్ చేయడానికే పుట్టినట్టుగా కనిపించే పాత్రను పోషిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. టైటిల్ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్.
“అనుభవించు రాజా” నవంబర్ 26న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా విడుదల సమయంలో 2 నుండి 3 వారాల వరకు పెద్ద పోటీ ఉండకపోవచ్చు. కాబట్టి సినిమా విడుదలకు ఇది సరైన సమయం అని భావించినట్టున్నారు మేకర్స్. నిర్మాతలు విడుదల తేదీని ఖరారు చేసేయడంతో చిత్రబృందం “అనుభవించు రాజా” ప్రమోషన్లలో దూకుడు పెంచనుంది. “అనుభవించు రాజా” చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించగా, సుప్రియ యార్లగడ్డ అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ