కోవాగ్జిన్‌కు ఆస్ట్రేలియా గ్రీన్‌ సిగ్నల్‌

- November 01, 2021 , by Maagulf
కోవాగ్జిన్‌కు ఆస్ట్రేలియా గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ : భారత్‌ నుండి వచ్చే ప్రయాణీకులకు ఆస్ట్రేలియా శుభవార్త చెప్పింది. కోవాగ్జిన్‌ తీసుకున్న ప్రయాణీకులకు దేశంలోకి అనుమతినిచ్చేందుకు ఆమోదం తెలిపింది.

నిబంధనల సడలింపుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ విజృంభించడంతో..కఠినమైన సరిహద్దు విధానాలను అవలంభించిన ఆస్ట్రేలియా 18 నెలల తర్వాత ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో లక్షలాది మంది ప్రయాణీకులు అనుమతి లేకుండా ప్రయాణించవచ్చు. దేశంలోకి వచ్చే సమయంలో కూడా క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. ' భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌, చైనాలోని షినోఫార్మ్‌ అభివృద్ధి చేసిన బిబిఐబిపి-కోర్‌విని వ్యాక్సిన్లను ఆమోదిస్తున్నాం. కోవాగ్జిన్‌ తీసుకున్న 12 అంతకన్నా ఎక్కువ ఏళ్ల వయస్కులు, కోర్‌వి వ్యాక్సిన్‌ తీసుకున్న 18 నుండి 60 ఏళ్ల మధ్య వయస్సు వారికి దేశంలోకి అనుమతినిస్తున్నాం' అని ఆస్ట్రేలియా ప్రభుత్వం మీడియా ప్రకటన చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com