అబుధాబి కూరగాయల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం

- March 20, 2016 , by Maagulf
అబుధాబి కూరగాయల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం

                     
ఆదివారం ఉదయం అబుధాబి  కూరగాయల మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక  మినా జాయెద్ పండ్లు  మరియు కూరగాయల మార్కెట్ వద్ద ఈ సంఘటన చోటుచేసుకొంది. ఇందులో 16 దుకాణాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అయితే, ఈ అగ్ని ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని  పౌర రక్షణ అధికారులు తెలిపారు.
ఈ రోజు ( ఆదివారం ) ఉదయం 5:00 గంటల ప్రాంతంలో తమకు ఈ అగ్ని సమాచారం అందిందని తాము వెంటనే నాలుగు అగ్ని మాపక దళాలను అక్కడకు పంపించి జాయెద్ రేవులో పెల్లుబికిన అగ్నిజ్వాలలను వేరే ఇతర దుకాణాలకు వ్యాప్తి చెందకుండా రసాయనాలను చల్లి అగ్నికీలలను నిరోధించేమని అబూ ధాబీ పౌర రక్షణ యొక్క ప్రత్యామ్నాయ జనరల్  కల్నల్ అబ్దుల్లా రషీద్ అల్ జాబ్ అన్నారు. తాజా పండ్లకు కూరగాయలకు మినా జాయెద్ ఎంతో ప్రసిద్ధి. నిత్యం ఇక్కడ్నుంచి రాజధానికి పెద్ద ఎత్తున సరఫరా కాబడతాయి. అంతే కాక  పలు పెంపుడు జంతువుల దుకాణాలు, అరుదైన పూల మొక్కల మార్కెట్ ఎంతో ప్రసిద్ధి చెందింది.అగ్ని ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే పౌర రక్షణ బృందాలు వేగంగా స్పందించడం వలన పెద్దగా ఆస్తి నష్టం జరగలేదని  మేజర్ జనరల్ జస్సిం అల్ మర్జౌకి తెలిపారు. సివిల్ డిఫెన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సివిల్ కమాండర్ కల్నల్ తారిక్ సాలెహ్ అల్ షరీఫ్, కల్నల్ అహ్మద్ బిన్ సైఫ్ ముహైరి నేతృత్వంలో అగ్ని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించారు. మినా జాయెద్ పండ్లు  మరియు కూరగాయల మార్కెట్ వద్ద అగ్ని ప్రమాదం ఎలా జరిగిందని ఇంకా వివరాలు అందలేదని కారణం నిర్ణయించడానికి తాము దర్యాప్తు చేస్తున్నట్లు  కల్నల్ అల్ జాబి తెలిపారు.

    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com