300 కి.మీ. స్పీడ్ తో కారు నడిపి సోషల్ మీడియాలో పోస్ట్..
- November 02, 2021
యూఏఈ: అబుధాబిలోని ఒక ప్రధాన రహదారి గుండా ఒక వ్యక్తి తన స్పోర్ట్స్ కారును గంటకు 300 కి.మీ వేగంతో డ్రైవ్ చేస్తూ వీడియో తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా తన ఫాలోవర్లను పెంచుకోవాలనే అత్యాశతో ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ కావడంతో సదరు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అబుదాబి న్యాయ శాఖ (ఏడీజేడీ) సోమవారం తెలిపింది. ఏడీజేడీ తెలిపిన వివరాల ప్రకారం.. అతి వేగంతో కారు నడిపిన డ్రైవర్.. దాన్ని తన ఇన్ స్టా గ్రామ్ హ్యాండిల్ లో పోస్ట్ చేశాడు. రోడ్ సేఫ్టీ నిబంధనలకు విరుద్ధంగా అతడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోపాటు తన ప్రాణాలను, ఆ వీడియోను షేర్ చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేశాడని యూఏఈ క్యాపిటల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయం తెలిపింది. వైరల్ వీడియో క్లిప్ చూసిన అధికారులు సదరు డ్రైవర్ ని గుర్తించారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి వీడియోల కారణంగా ఇతర యువకులు కూడా ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ లను చేసే ప్రమాదం ఉందని కార్యాలయం పేర్కొంది. షార్జా అంతర్గత రహదారిపై వేగంగా నడిపిన నలుగురు డ్రైవర్లను షార్జా పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







