ప్రైవేట్ సెక్టార్ లో 400 ఉద్యోగాలు-కార్మిక శాఖ

- November 02, 2021 , by Maagulf
ప్రైవేట్ సెక్టార్ లో 400 ఉద్యోగాలు-కార్మిక శాఖ

ఒమాన్: మస్కట్  నార్త్ అల్ బతినా గవర్నేరేట్ పరిధిలోని ప్రైవేట్ సెక్టార్ లో 400 ఉద్యోగాలు ఉన్నట్లు కార్మిక శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన రిక్రూట్ మెంట్ ను కార్మిక శాఖ అధికారులు ప్రారంభించారు. పలు ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీ ఆధారంగా 400 ఉద్యోగాలు ఉన్నట్లు గుర్తించి వీటిని రిక్రూట్ చేయాలని నిర్ణయించారు. ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవటానికి కావాల్సిన అర్హతలను http://www.mol.gov.om/job అనే వెబ్ సైట్ లో చూడొచ్చు. పూర్తి వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కార్మిక శాఖ అధికారులు కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com