కేరళ బ్యూటీ క్వీన్స్ దుర్మరణం
- November 02, 2021
కేరళలోని కోచిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో.. అందాల పోటీల్లో కిరీటాలు కైవసం చెసుకున్న ఇద్దరు సుందరీమణులు దుర్మరణం చెందారు. సోమవారం తెల్లవారుజామున అన్సీ కబీర్(25), డాక్టర్ అంజనా షాజన్, మరో వ్యక్తి ప్రయాణిస్తున్న కారు అత్యంత వేగంగా చెట్టును ఢీకొట్టింది. ఈ ధాటికి కారు తుక్కుతుక్కయింది. హైవేలో వెళ్తుండగా స్కూటర్‌ను తప్పించబోయి కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అన్సీ, అంజనాను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయారని డాక్టర్లు ధ్రువీకరించారు. మూడో వ్యక్తి, డ్రైవరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. కాగా.. తిరువనంతపురం జిల్లాలోని ఆలంకోడేకు చెందిన అన్సీ కబీర్.. 2019లో మిస్ కేరళ పోటీల విజేత.. 2021లో మిస్ సౌత్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. మోడల్, డాక్టర్ అంజనా షాజన్ 2019 మిస్ కేరళ అందాల పోటీల్లో రన్నర్‌పగా నిలిచారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!