Ashal పోర్టల్ ద్వారానే కొత్త వీసాల జారీ
- November 03, 2021
కువైట్: Ashal పోర్టల్ ద్వారానే కార్మికులకు కొత్త వీసాలు జారీ అవుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ వెల్లడించింది. ఇందుకోసం ఆరు దశల ప్రక్రియను ప్రకటించింది. వీసా జారీ చేయాల్సిన వ్యక్తి తొలుత ఎలక్ట్రానిక్ పద్ధతిలో వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను సమర్పించి ఆమోదం పొందాలి. దీంతో మొదటి దశ పూర్తవుతుంది. వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఆమోదం పొందిన తర్వాతనే "ఆశల్" ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా వీసా అప్లికేషన్ ను సమర్పించాల్సి ఉంటుంది. వీసా జారీ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్ సిస్టం ద్వారానే పూర్తవుతుంది. వీసా ఫీ కూడా ఆన్ లైన్ లోనే చెల్లించాలి. ఆపై కార్మిక శాఖ నుంచి వీసా కాపీని పొందేందుకు రిక్వెస్టును కూడా ఆశల్ పోర్టల్ ద్వారానే సమర్పించాల్సి ఉంటుందని అవుతాయని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







