సౌదీలో భారీగా పెరిగిన నగదు బదిలీలు.. సెప్టెంబర్ లో 44 శాతం వృద్ధి
- November 03, 2021
సౌదీ అరేబియా: సౌదీ సెంట్రల్ బ్యాంక్ (SAMA) నెలవారీ బులెటిన్ ప్రకారం.. 2021 మొదటి తొమ్మిది నెలల్లో నగదు బదిలీలు భారీగా పెరిగాయి. ఇందులో సౌదీ సిటిజన్స్, సౌదీ బయట ఉన్న సిటిజన్స్ భారీగా నగదు బదిలీ చేశారని సౌదీ అరేబియాలో తెలిపింది. 2021 మొదటి 9 నెలల్లో(2020తో పోల్చితే) సౌదీ బయట సిటజన్స్ జరిపిన నగదు బదిలీల్లో 36 శాతం పెరుగుదల నమోదై SR47 బిలియన్లకు చేరుకుంది. ఒక్క సెప్టెంబర్ లోనే 44 శాతం (SR5.79 billion) వృద్ధిని నమోదు చేసింది. అదే సమయంలో ప్రవాసుల వ్యక్తిగత చెల్లింపులు SR116.3 బిలియన్లకు పెరిగాయి. 2020లో ఇదే కాలంతో పోలిస్తే ఇది ఆరు శాతం పెరుగుదల నమోదైంది. ప్రవాసుల మొత్తం రెమిటెన్స్ లు ఒక శాతం పెరుగుదలను నమోదు చేయగా.. సెప్టెంబర్ నెలలో SR13.35 బిలియన్లకు చేరుకున్నాయి. ఇటీవల 20 శాతం ఫారీన్ ఫార్మసిస్టులను నియమించడం కూడా నగదు బదిలీ పెరిగేందుకు కారణమైందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే సెప్టెంబరులో విదేశీ రెమిటెన్స్ లు సుమారు మూడు శాతం తగ్గుదలని నమోదు చేసి SR388 మిలియన్లకు చేరుకున్నాయని సౌదీ సెంట్రల్ బ్యాంక్ డేటా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







