'భీమ్లా నాయక్' నుంచి దీపావళి గిఫ్ట్

- November 03, 2021 , by Maagulf
\'భీమ్లా నాయక్\' నుంచి దీపావళి గిఫ్ట్

త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన 'అజ్ఞాతవాసి' తర్వాత మూడేళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' తర్వాత పవన్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అంతా ఇష్టం అంటూ పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ లపై మరో పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాటలో పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ కలిసి నటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 'భీమ్లా నాయక్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమా విషయానికొస్తే.. మలయాళంలో హిట్టైన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' మూవీ రీమేక్. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.

త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్' అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు మరోసారి పోస్టర్‌లో చూపించారు. తాజాగా ఈ సినిమా నుంచి 'లాల భీమ్లా' వీడియో ప్రోమోను ఈ రోజు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ కింద కూర్చోని.. పక్కనే పెద్ద బాటిల్ పెట్టుకొని ఏదో చూస్తున్నట్టు ఉన్న పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్య మీనన్, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com