తెలుగు పదాన్ని పలకడంలో ఇబ్బంది పడ్డ లక్ష్మీ మంచు.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

- November 03, 2021 , by Maagulf
తెలుగు పదాన్ని పలకడంలో ఇబ్బంది పడ్డ లక్ష్మీ మంచు.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

ల‌క్ష్మీ మంచుని నెటిజ‌న్స్ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఇంత‌కీ ఆమెను ట్రోల్ చేయ‌డానికి కార‌ణ‌మేంటి? అని అనుకుంటున్నారా? స్టేజ్‌పై ఆమె మాట్లాడిన తెలుగే కార‌ణం. సాధార‌ణంగా ల‌క్ష్మీ మంచు అమెరికా పెర‌గ‌డం వ‌ల్ల ఆమె తెలుగు స్లాంగ్ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ట్రోలింగ్ కూడా జ‌రిగింది. కానీ ఒక‌ప్ప‌టితో పోల్చితే ఇప్పుడు ల‌క్ష్మీ మంచు చ‌క్క‌గానే తెలుగు మాట్లాడుతున్నార‌నాలి. వీట‌న్నింటికీ ప‌క్క‌కు పెడితే, మంగ‌ళ‌వారం సాయంత్రం జ‌రిగిన ఆహా వేడుక‌ను ల‌క్ష్మీ మంచు హోస్ట్ చేశారు. ఆ వేడుక‌లో ఆమె మాట్లాడే సంద‌ర్భంలో తెలుగువారి ఆత్మ గౌర‌వం అనే ప‌దాన్ని ప‌ల‌క‌డంలో కాస్త త‌డ‌బ‌డ్డారు. ఇంకేముంది.. మ‌న నెటిజ‌న్స్‌కు, ట్రోల‌ర్స్‌కు పాయింట్ దొరికేసింది. స‌ద‌రు వీడియోను వాళ్లు క‌ట్ చేసి సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు.

కొంద‌రైతే ఏకంగా ల‌క్ష్మీ మంచుని ఫుల్‌గా టార్గెట్ చేశారు. కొంద‌రైతే బూతులు కూడా వాడేశారు. తెలుగు చంపి నాశ‌నం చేసి పాపం చేయ‌క‌ని, నీ క‌న్నా ఆంగ్లో ఇండియ‌న్స బెట‌ర్ అని కొంద‌రు అంటే.. తెలుగుత‌ల్లి నీ తెలుగు వింటే ఆత్మహ‌త్య చేసుకుంటుంద‌ని, మీరెందుకు తెలుగు స‌రిగ్గా ప‌ల‌క‌ర‌ని కొంద‌ర‌న్నారు. తెలుగుని ఖూనీ చేస్తున్నావ్‌.. ఆ స్లాంగ్ ఏంట‌ని .. ఇలా త‌మ‌కొచ్చిన రీతిలో ట్రోల్ చేయ‌డం ప్రారంభించారు. అదే వేడుక‌లో అల్లు అర్జున్ కూడా మంచు ల‌క్ష్మి ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే బ‌న్నీ రివ‌ర్స్‌లో అంద‌రికీ అర్థ‌మ‌య్యే తెలుగులో మాట్లాడాలంటూ కొన్ని పంచ్‌లు విసిరాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com