ICC T20: దుమ్ములేపిన టీమిండియా..
- November 03, 2021
అబుధాబి: అబుధాబి క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ విశ్వరూపం ప్రదర్శించింది. పాకిస్థాన్, న్యూజిలాండ్‌పై ఓడి బోల్డన్ని విమర్శలు మూటగట్టుకున్న కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో చెలరేగిపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సెమీస్ అవకాశాలు లేని వేళ ఆఫ్ఘన్ జట్టుపై బ్యాట్‌తో నిప్పులు చెరిగింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించడం ఎంత ప్రమాదకరమో రాహుల్, రోహిత్ బ్యాటింగ్‌ను చూశాక కానీ ఆఫ్ఘన్ కెప్టెన్ నబీకి తెలిసిరాలేదు. ఇద్దరూ ఎడాపెడా షాట్లు కొడుతూ తొలి వికెట్‌కు ఏకంగా 140 పరుగులు జోడించారు. రాహుల్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్‌తో 74 పరుగులు చేశాడు. రిషభ్ పంత్ 13 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 27, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేయడంతో భారత స్కోరు జెట్ స్పీడుతో పరిగెత్తి 210 పరుగుల వద్ద ఆగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..