కార్లలో చిన్నారుల భద్రత: కొత్త మార్గదర్శకాలు

- November 06, 2021 , by Maagulf
కార్లలో చిన్నారుల భద్రత: కొత్త మార్గదర్శకాలు

సౌదీ: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, చిన్నారుల భద్రత విషయమై నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలకు సిద్ధమవుతోంది. 10 ఏళ్ళ లోపు చిన్నారుల్ని ముందు సీట్లలో కూర్చోబెట్టడంపై కఠినంగా స్పందించనున్నారు. జరీమానాలు 400 సౌదీ రియాల్స్ నుంచి 500 సౌదీ రియాల్స్ వరకు వుంటాయి. బ్యాక్ సీట్లు లేని వాహనాలకు సంబంధించి వెసులుబాటు కల్పిస్తారు. సీట్ బెల్ట్ ధరించని పక్షంలో 150 సౌదీ రియాల్స నుంచి 300 సౌదీ రియాల్స్ వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com