ఎమిరాటీ కష్టాలు విని చలించిన షేక్ సుల్తాన్..

- November 09, 2021 , by Maagulf
ఎమిరాటీ కష్టాలు విని చలించిన షేక్ సుల్తాన్..

షార్జా: "డైరెక్ట్ లైన్"లో ఎమిరాటీ కష్టాలు విని సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు షేక్ డా. సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి చలించారు. ఎమిరాటీకి చెందిన ఇంటిని విక్రయించడానికి చేపట్టిన వేలాన్ని నిలిపివేయాలని షేక్ సుల్తాన్ ఆదేశించారు. అతని సమస్యను తెలుసుకొని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఓ వ్యక్తి 3.5 మిలియన్ దిర్హాల బ్యాంక్-హౌసింగ్ లోన్ ద్వారా ఆ ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే అతను రెండేళ్లుగా ఆర్థిక పరిస్థితుల కారణంగా అతను మిగిలిన వాయిదాలను బ్యాంకుకు చెల్లించలేకపోవడంతో బ్యాంక్ ఆతని ఇంటిని వేలం వేయనుంది.

షార్జా రేడియో, టెలివిజన్ ద్వారా ప్రసారం చేయబడిన "డైరెక్ట్ లైన్"లో సదరు వ్యక్తి తన సమస్యను చెప్పుకున్నాడు. దీంతో ఆతని సమస్యపై షేక్ సుల్తాన్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించారు. తన తల్లి, ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలతో ఆ ఇంటిలోనే ఉంటున్నట్లు చెప్పాడు.  తన ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో ధ్వంసమైందని, జరిగిన నష్టం కారణంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయానని తెలిపాడు. వాయిదాలు కట్టని కారణంగా కోర్టులో బ్యాంక్ దావా వేసిందని.. ఆరు నెలల గడువు ముగియటంతో నవంబర్ 10, 2021న తన ఇంటిని వేలం వేయబోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తను బ్యాంకుకు చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని రీషెడ్యూల్ చేయాలని,  నెలవారీ వాయిదాను Dhs10,000 కు తగ్గించాలని వేడుకున్నాడు.  తన కుటుంబానికి నివసించడానికి ఈ ఇల్లు తప్ప వేరే స్థలం లేదని, ప్రస్తుతం ఇది అమ్మకానికి రావడం తమ కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చిందని "డైరెక్ట్ లైన్"లో వాపోయాడు. దీంతో షార్జా పాలకుడు డాక్టర్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అతనికి అండగా నిలిచారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com