తెలంగాణ:మరో 13 డయాగ్నోస్టిక్ సెంటర్లు
- November 10, 2021
హైదరాబాద్: తెలంగాణలో టి-డయాగ్నోస్టిక్స్ పథకంలో భాగంగా ఇప్పటికే 20 జిల్లాల్లో రోగ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. తాజాగా మరో 13 చోట్ల నెలకొల్పేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవి కాకుండా మరో 8 వైరాలజీ ల్యాబ్‌లను సైతం ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ సర్కారు రూ.96.39 కోట్లు విడుదల చేసింది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లలో 56 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. కొత్త డయాగ్నోస్టిక్ సెంటర్లను జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, నారాయణపేట, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరిలో ఏర్పాటు చేయనున్నారు.
తొలుత నాలుగేళ్ల కిందట హైదరాబాద్ నగరంలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసన్ (IPM) ఆవరణలో తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో పూర్తిస్థాయిలో వాటంతట అవే పరీక్షలు చేసి ఫలితాలను వెల్లడించే రూ.3 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ప్రతిరోజూ బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన నమూనాలను ఈ ప్రయోగశాలకు చేరుస్తారు. రోగుల నుంచి నమూనాలు సేకరించినప్పుడే వారి ఈ-మెయిల్, ఐడీ, మొబైల్ నంబరును తీసుకుంటారు. ల్యాబ్‌లో టెస్టుల అనంతరం ఆటోమేటిక్‌గా ఫలితాలను రోగి ఇచ్చిన మొబైల్ నంబరు లేదా ఈమెయిల్‌కు పంపుతారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







