వలసదారులపై ఆధారపడ్డవారికి సంబంధించిన రుసుము త్రైమాసిక చెల్లింపుకి అవకాశం
- November 10, 2021
సౌదీ: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవజాత్) చేసిన ప్రకటన ప్రకారం వలసదారులు, తమపై ఆధారపడినవారికి సంబంధించిన ఫీజుని (రెసిడెన్సీ పర్మిట్ ఇకామా రెన్యువల్) త్రైమాసిక పద్ధతిలో చెల్లించడానికి వీలు కల్పించనున్నారు. అప్ డేట్ చేసిన గవర్నమెంట్ పేమెంట్స్ సిస్టమ్ ద్వారా అన్ని సౌదీ లోకల్ బ్యాంకులలోనూ ఈ ఫీజుల్ని చెల్లించవచ్చు. భార్య, 18 ఏళ్ళ లోపు కుమారులు లేదా కుమార్తెలు ఈ సంబంధీకుల లెక్కల్లోకి వస్తారు. అలాగే భార్యలు (మొదటి, రెండవ మరియు మూడవ), తండ్రి, తల్లి, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, డొమెస్టిక్ వర్కర్స్, ముకీమ్ సిస్టమ్లో రిజిస్టర్ అయినవారు ఈ లిస్టులోకి వస్తారు. నెలవారీ ఫీజు 400 సౌదీ రియాల్స్ ఒక్కొక్కరికీ చెల్లించాలి. కాగా, వర్క్ పర్మిట్ రెన్యువల్ ఫీజు 800 సౌదీ రియాల్స్ లేదా 600 సౌదీ రియాల్స్ ఏడాదికి వుంటుంది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







