తర్వలోనే కువైట్-ఎమిరేట్స్ మధ్య పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు

- November 11, 2021 , by Maagulf
తర్వలోనే కువైట్-ఎమిరేట్స్ మధ్య పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు

కువైట్: కువైట్-ఎమిరేట్స్ మధ్య మళ్లీ పూర్తిస్థాయిలో విమాన సర్వీసులు నడపాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించారు. 2015 లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య మళ్లీ యధావిధిగా విమాన సర్వీసులు నడపనున్నారు. అందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను నిర్ణయించేందుకు కువైట్ లో రెండు దేశాల సివిల్ ఏవియేషన్ అధికారులు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ కు కువైట్ లోని ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ మతర్ హమీద్ అల్ నియాదీ కూడా పాల్గొన్నారు. త్వరలోనే విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సమావేశం తర్వాత అధికారులు మీడియాకు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com