సౌదీ ఆర్థిక వ్యవస్థ రికార్డు వృద్ధి.. దశాబ్దంలోనే అత్యధికం

- November 13, 2021 , by Maagulf
సౌదీ ఆర్థిక వ్యవస్థ రికార్డు వృద్ధి.. దశాబ్దంలోనే అత్యధికం

సౌదీ: సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ మూడవ త్రైమాసికంలో మంచి ఫలితాలను నమోదు చేసింది. గత దశాబ్ద కాలంలో ఇది అత్యధికం కావడం విశేషం. అధిక చమురు ధరల కారణంగానే ఇది సాధ్యమైందని ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం తెలుస్తోంది. 2020 ఇదే త్రైమాసికంతో పోల్చితే స్థూల దేశీయోత్పత్తి 6.8 శాతం పెరిగింది. అంతకుముందు 2012లో ఇంతకంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. అప్పుడు చమురు ధరలు బ్యారెల్‌కు సగటున $122 ఉండేవి.  గత మూడు నెలలతో పోలిస్తే వృద్ధి 5.8 శాతం పెరిగింది. చమురు రంగం సంవత్సరానికి 9 శాతం చొప్పు వృద్ధి నమోదు చెందగా.. చమురుయేతర ఆర్థిక వ్యవస్థ - ఉద్యోగ సృష్టి సెక్టర్లు 6.2 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అయితే చమురుయేతర కార్యకలాపాలు ఊహించిన దానికంటే తక్కువ వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 1.6 శాతం మాత్రమే పెరుగుదల నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com