అభిమానులకు స్పెషల్ అప్డేట్ ఇచ్చిన రాధేశ్యామ్ మేకర్స్..
- November 13, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా తర్వాత ప్రభాస్ స్క్రీన్ పై కనిపించలేదు. దీంతో ఆయన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం డార్లింగ్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నాడు. చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. అయితే ఓ వైపు ప్రభాస్ సినిమాలను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నా.. ఇప్పటివరకు ఒక్క సినిమా మాత్రం ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ క్రమంలో ప్రభాస్.. పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో నటించిన రాధేశ్యామ్ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేస్తు్న్నారు. అయితే ఈ మూవీ పూర్తై చాలా రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. రాధేశ్యామ్ సినిమా నుంచి ఒక్క అప్డేట్ అయిన ఇవ్వండంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్స్‌కు రాధేశ్యా్మ్ చిత్రయూనిట్ దిగొచ్చింది.
రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన స్పెషల్ అప్డేట్ రిలీజ్ చేసే సమయాన్ని.. తేదీని ప్రకటించి అభిమానులకు కాస్త ఖుషి చేసింది. ప్రభాస్.. పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా నుంచి “ఈ రాతలే.. ” అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ వీడియోను ఈనెల 15న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది. ఈ మేరకు ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.
The wait is over! ☺️☺️
— UV Creations (@UV_Creations) November 13, 2021
Get ready for the #FirstRadheShyamSong to dominate your playlist! 💓 #RadheShyam
Starring #Prabhas & @hegdepooja pic.twitter.com/HMPELs2Bsz
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







