కేజ్రీవాల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సుప్రీమ్ కోర్ట్ జస్టీస్

- November 13, 2021 , by Maagulf
కేజ్రీవాల్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సుప్రీమ్ కోర్ట్ జస్టీస్

ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి తర్వాత పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీచేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యానికి తగ్గించేందుకు అత్యవసర ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. 2 రోజుల పాటు లాక్‌డౌన్ విధించయినా సరే కాలుష్యాన్ని తగ్గించాలని స్పష్టం చేసింది. AQI 500 నుంచి 200 తగ్గించేలా ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది సుప్రీంకోర్టు.

ఢిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ''ఢిల్లీ ప్రజలు ఇళ్లల్లోనూ మాస్క్ ధరించే దారుణ పరిస్థితులు ఉన్నాయి. మనం ఇంట్లో కూడా మాస్క్‌లు ధరించాలా? కాలుష్యం నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? 500గా ఉన్న AQI (Air Quality Index) ని 200కి తగ్గించాలంటే మన వద్ద ఉన్న మార్గాలేంటి? 2 రోజులు లాక్‌డౌన్ విధిస్తారా? ఇంకేదైనా చేస్తారా? ఏమైనా చేయండి.కాలుష్య నియంత్రణకు అత్యవసర చర్యలు తీసుకోండి. ''' అని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఢిల్లీ వాయు కాలుష్యంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్, పర్యావరణ మంత్రి గోపాల్ రాజ్, చీఫ్ సెక్రటరీ హాజరుకానున్నారు. వాయు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com