ఇంట్లోనే ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడతారేమోనని భయం: సైఫ్
- November 13, 2021
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ .. అమృత సింగ్ నుండి విడిపోయి కరీనా కపూర్‌ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ కు అమృత సింగ్ తో ఇద్దరు పిల్లలు సంతానం కాగా, వారి పేర్లు సారా అలీ ఖాన్, ఇబ్రహీం అమృత సింగ్. ఇక కరీనాని 2012లో పెళ్లి చేసుకున్న సైఫ్.. తైమూర్, జహంగీర్ అనే ఇద్దరు చిన్నారులకి జన్మనిచ్చారు. అయితే సైఫ్ ప్రస్తుతం బంటీ ఔర్ బబ్లీ 2 చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
తాజాగా కపిల్ శర్మ కోసం రాణీ ముఖర్జీతో కలిసి హాజరైన సైఫ్.. అదిరిపోయే పంచ్ వేసి అందరిని నవ్వించాడు. మీకు పనిమీద ప్రేమ ఎక్కువై ఇలా వరుసగా సినిమాలు చేస్తున్నారా ? లేక పిల్లలు పుడుతుండడం, ఫ్యామిలీ బాధ్యతల వల్ల సినిమాలు చేస్తున్నారా అని కపిల్ ప్రశ్నించాడు. దీనికి సైఫ్ సమాధానం ఇస్తూ.. ‘ ఫ్యామిలీ కోసం కాదు కానీ.. ఇంట్లోనే ఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుడతారేమో అని భయంగా ఉంది.. అందుకే వర్క్ తో బిజీ అయిపోతున్నా’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







