కోవిడ్ 19 రిస్క్ దేశాలకు సంబంధించిన కేటగిరీల తాజా లిస్ట్ విడుదల

- November 13, 2021 , by Maagulf
కోవిడ్ 19 రిస్క్ దేశాలకు సంబంధించిన కేటగిరీల తాజా లిస్ట్ విడుదల

దోహా: ఖతార్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కోవిడ్ 19 రిస్క్ ప్రభావం ఆధారంగా ఆయా దేశాలతో కూడిన తాజా కేటగిరీ లిస్ట్ విడుదల చేయడం జరిగింది. సోమవారం నుంచి ఈ అప్ డేట్ లిస్టు అమల్లోకి వస్తుంది. ఎక్సెప్షనల్ రెడ్ లిస్టులో 10 దేశాలున్నాయి. వీటిల్లో ఇండియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేసియా, నేపాల్, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సుడాన్ మరియు సౌత్ సుడాన్ వున్నాయి. గ్రీన్ లిస్టులో 181 దేశాలు వున్నాయి. రెడ్ లిస్టులో 21 దేశాలున్నాయి. ఖతార్ వచ్చే ముదు ప్రయాణీకులు అండర్‌టేకింగ్ మరియు అక్నాలెడ్జిమెంట్ ఫార్మ్ పూర్తి చేయాలి. ఎంవోపిహెచ్ వెబ్‌సైట్‌లో ఇది లభ్యమవుతుంది. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ వేదిక (ఎహ్తెరాజ్) ద్వారా కూడా చేయొచ్చు. వ్యాక్సినేషన్ పొందిన పౌరులు, నివాసితులు గ్రీన్ దేశాల నుంచి వస్తే, వారికి నిబంధనల నుంచి వెసులుబాటు వుంటుంది. పూర్తిగా వ్యాక్సిన్ పొందిన కతారీ పౌరులు, నివాసితులు గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి వస్తే, వారికి ప్రీ ట్రావెల్ పిసిఆర్ టెస్ట్ అవసరం లేదు. వచ్చిన తర్వాత 36 గంటల్లోపు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com