అదరగొడుతున్న లుక్ లో 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' అంటూ వచ్చేస్తున్న బన్నీ..
- November 14, 2021ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' చిత్రంపై ఒక రేంజ్ లో హైప్ ఉంది. డిసెంబర్ 17న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, బన్నీ కాంబినేషన్ కావడంతో.. పైగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.
విడుదల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే విడుదలైన దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ పాటలు యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. తొలిసారి అల్లు అర్జున్ రగ్గడ్ లుక్ లో, ఊర మాస్ అవతారంలో కనిపిస్తున్నాడు. తాజాగా చిత్ర యూనిట్ పుష్ప చిత్రంలోని నాల్గవ పాట అప్డేట్ ఇచ్చింది.
'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా' అంటూ సాగే పాటని నవంబర్ 19న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీని కోసం విడుదల చేసిన పోస్టర్ బన్నీ అభిమానులకు సర్ ప్రైజ్ అని చెప్పొచ్చు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ మరో డిఫెరెంట్ లుక్ లో మాస్ స్టైల్ లో అదరగొడుతున్నాడు. ఒక డాన్ తరహాలో బన్నీ ఇస్తున్న ఫోజు కిక్కిచ్చేలా ఉంది.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రతి పాట సూపర్ హిట్ అవుతుండడంతో చిత్ర యూనిట్ హ్యాపీగా ఉంది. బన్నీ నుంచి సాంగ్ వస్తే యూట్యూబ్ లో రికార్డులు మోతెక్కుతున్నాయి. మరి నాల్గవ సాంగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. ఎర్రచందనంని అక్రమంగా తరలించే లారీ డ్రైవర్ గా ఉండే పుష్పరాజ్.. స్మగ్లింగ్ సామ్రాజ్యానికి డాన్ గా మారుతాడా ? బహుశా అయిఉండొచ్చు.. ఈ పోస్టర్ ని చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
#PushpaFourthSingle 🤘#PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic @PushpaMovie pic.twitter.com/6qW29fZybK
— Mythri Movie Makers (@MythriOfficial) November 14, 2021
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?