ఎన్సీఏ చీఫ్‌గా వీవీఎస్ లక్ష్మణ్: గంగూలీ
- November 14, 2021
టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ త్వరలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఈ విషయాన్ని ఆదివారం ధ్రువీకరించాడు. ఇదివరకు ఎన్సీఏ హెడ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ఇటీవల టీమ్ఇండియా కోచ్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ పెద్దలు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే ఆ బాధ్యతలు చేపట్టేందుకు తొలుత లక్ష్మణ్ నిరాకరించాడని వార్తలు వచ్చాయి. అధ్యక్షుడు గంగూలీ, సెక్రెటరీ జైషా లక్ష్మణ్‌తో చర్చించి ఒప్పించారని తెలిసింది.
మరోవైపు ఇటీవల ద్రవిడ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తొలుత రాహుల్ సైతం టీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా పనిచేయడానికి ఒప్పుకోలేదనే వార్తలు వినిపించాయి. చివరికి గంగూలీ, షా పట్టుబట్టి ఒప్పించారని తెలిసింది. కాగా, ఒకప్పుడు మైదానంలో పరుగుల వరద పారించిన దిగ్గజాలు ఇప్పుడు భారత జట్టుకు వెన్నెముకలా నిలిచారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో అయినా టీమ్ఇండియా ఐసీసీ ట్రోఫీలు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. రాబోయే రెండు, మూడేళ్లలో మరో టీ20 ప్రపంచకప్‌తో పాటు, టెస్టు ఛాంపియన్షిప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఉన్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?