GCC మీటింగ్ కోసం బహ్రెయిన్ చేరుకున్న ప్రిన్స్ అబ్దుల్ అజీజ్
- November 15, 2021
సౌదీ: GCC (గల్ఫ్ కో అపరేషన్ కౌన్సిల్) అంతర్గత వ్యవహారాల మంత్రుల 38వ సాధారణ సమావేశంలో పాల్గొనేందుకు సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ శనివారం బహ్రెయిన్ చేరుకున్నారు. అనంతరం బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో మనామాలో సమావేశమయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారు చర్చలు జరిపారు. అంతకుముందు బహ్రెయిన్ ఎయిర్ పోర్టులో ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ కు ఘన స్వాగతం లభించింది. బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఆయనకు స్వాగతం పలికారు. ఆయనతోపాటు ప్రిన్స్ సుల్తాన్ బిన్ అహ్మద్, బహ్రెయిన్ రాజ్యంలో సౌదీ రాయబారి, బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..