యూఎన్ లో సభ్యత్వం తీసుకొని 50 ఏళ్లు. స్మారక స్టాంప్ ను విడుదల చేసిన ఒమన్
- November 15, 2021
మస్కట్ : యూనైటెడ్ నేషన్స్ (UN) లో ఒమన్ సభ్య దేశంగా చేరి 50 ఏళ్లు అయ్యింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఒమన్ పోస్ట్ తో కలిసి కొత్త స్టాంప్ ను రిలీజ్ చేసింది. ఒమన్ విదేశాంగ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసాయిదీ, రవాణా, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి హమూద్ అల్ మవాలీ, ఒమన్ పోస్ట్ ప్రతినిధులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. అక్టోబర్ 8,1971న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో 131 వ సభ్య దేశంగా ఒమన్ చేరింది. ఈ సందర్భంగా అప్పటి ఒమన్ పాలకుడు సయ్యద్ తారిక్ బిన్ తైమూర్ అల్ సయీద్ దేశ జెండాను ఎగురవేసి, ప్రసంగించారు. ఆనాటి ఆయన ప్రసంగం ఫోటోతోనే స్టాంప్ ను రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..