ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పని చేసుకోవచ్చు.. ఆఫర్లు ఇవే..
- November 15, 2021
భారత్: విద్యార్థుల్లో నాణ్యమైన విద్య, నైపుణ్యాలను పెంపొందించడానికి అనేక సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. మెరుగైన శిక్షణతో మీ కెరీర్‌ను ఉన్నతంగా మార్చుకునేందుకు సహాయపడుతున్నాయి. అయితే కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థలో మార్పులు వచ్చాయి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వేగంగా విస్తరించింది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేస్తూ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాలను పలు సంస్థలు కల్పిస్తున్నాయి. వీటి ద్వారా మీ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఆయా ఇంటర్న్‌షిప్‌ల గురించి తెలుసుకుందాం.
టీమ్ ఎవరెస్ట్
భారతదేశంలో యువత నిర్వహించే అతిపెద్ద ఎన్జీఓల్లో టీమ్ ఎవరెస్ట్ ఒకటి. టీమ్ ఎవరెస్ట్ సంస్థ 'డిజైన్ ఎ గేమ్' కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేస్తోంది. వర్చువల్ గేమింగ్‌లో రిసెర్చ్ చేయాలనుకునే వారికి ఈ ఇంటర్న్‌షిప్ సరిగ్గా సరిపోతుంది. ఆసక్తి గల వారు డిసెంబర్ 21లోపు ఇంటర్న్‌షిప్‌కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఇంటర్న్‌షిప్ వ్యవధి ఎటువంటి స్టైఫండ్ చెల్లించరు.
ఎర్త్5 ఆర్
ఇది ఒక పర్యావరణ సంస్థ. 'ఎన్విరాన్‌మెంట్ ఛాంపియన్' పోస్ట్ కోసం వర్క్ ఫ్రమ్ ఇంటర్న్‌షిప్‌ను అందిస్తోంది. ఇంటర్న్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఈ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అభ్యర్థులు వ్యర్థాల డేటాను విశ్లేషించి రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, 'ప్లాస్టిక్ కాలుష్యం, వ్యర్థాలను వేరుచేసే పద్ధతులతో వచ్చే హానికరమైన ప్రభావాల'పై పౌరులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు డిసెంబర్ 14 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఇంటర్న్‌షిప్‌లో ఎలాంటి స్టైఫండ్ చెల్లించరు.
టీచ్ ఫర్ ఇండియా
ఇది టీచ్-ఫర్ ఆల్ నెట్‌వర్క్‌కు సంబంధించింది. ఈ ఇంటర్న్‌షిప్ మూడు నెలల వ్యవధి ఉంటుంది. ఒక చిన్న గ్రూప్ విద్యార్థులను పర్యవేక్షించడానికి 'స్టూడెంట్ మెంటరింగ్' మెంటరింగ్ ఇంటర్న్‌షిప్‌ను అందిస్తోంది. డిసెంబర్ 6లోపు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి. కాగా, ఈ వ్యవధిలో ఎటువంటి స్టైఫండ్ చెల్లించరు.
స్పోర్ట్స్ కీడా
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రీడాకారులను కలిపే ఏకైక వేదిక స్పోర్ట్స్ కీడా. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈఓ) ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని అందిస్తోంది. అభ్యర్థులు ఎస్ఈఓ బృందానికి సహాయం చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ వ్యవధి మొత్తం ఆరు నెలలు. అభ్యర్థులు డిసెంబర్ 17 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవధిలో అభ్యర్థికి నెలకు రూ.10,000 స్టైఫండ్ చెల్లిస్తారు.
గ్రేడ్ అప్, గ్రేడ్ స్టాక్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్
ఈ సంస్థ కంటెంట్ డెవలప్మెంట్ ఇంటర్న్‌షిప్‌ను ఆఫర్ చేస్తోంది. అభ్యర్థి యూజీసీ నెట్(కంప్యూటర్ అప్లికేషన్ పేపర్ 2) కోసం తాజా ప్రశ్నలను ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. గత NET, SET పేపర్లను కూడా పరిష్కరించాల్సి ఉంటుంది. డిసెంబరు 16లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థికి నెలకు రూ. 1000 నుంచి 4000 స్టైఫండ్ చెల్లిస్తారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్‌లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







