సొమ్మొకడిది, సోకొకడిది అంటే ఇదేనేమో..అమెరికా ఆయుధాలతో తాలిబన్ల బలప్రదర్శన
- November 15, 2021
ఆఫ్గనిస్తాన్: అమెరికా, ఇతరదేశాల దళాలు వదిలేసి వెళ్లిన ఆయుధాలతో తాలిబన్లు ఆదివారం బల ప్రదర్శన నిర్వహించారు. వీటిల్లో అమెరికా సాయుధ వాహనాలు, రష్యా హెలికాప్టర్లు ఉన్నాయి.
ఆగస్టులో పౌర ప్రభుత్వం కుప్పకూలి తాలిబన్లు అధికారంలోకి రావడంతో వారు ఈ ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. తాలిబన్ దళాల్లో 250 మంది సైనికులు కొత్తగా శిక్షణ పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈ కవాతు నిర్వహించారు.
ఈ కవాతులో అమెరికా తయారు చేసిన ఎం117 సాయుధ వాహనాలు, ఎం-17 హెలికాప్టర్లు, అమెరికాలో తయారైన ఎం4 అసాల్ట్ తుపాకులు వంటి వాటిని ప్రదర్శించారు. అఫ్గాన్ జాతీయ దళాల్లో పనిచేసిన పైలట్లు, మెకానిక్‌లను తాజాగా తమ బలగాల్లో చేర్చుకొంటున్నట్ల తాలిబన్ ప్రతినిధి వెల్లడించారు. తాలిబన్లు ఇటీవల మిలటరీ దుస్తులను వాడటం మొదలు పెట్టారు. గతంలో తాలిబన్ ఫైటర్లు కేవలం సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే కనిపించేవారు.
ఇమ్రాన్- పాక్ తాలిబన్లకు మధ్యవర్తిగా తాలిబన్లు..!
ఇటీవల పాక్ ప్రభుత్వానికి, ఉగ్ర సంస్థ తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ ఉగ్ర సంస్థకు మధ్య అఫ్గాన్ తాలిబన్లు మధ్యవర్తిత్వం వహించారు. ఈ విషయాన్ని అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ కాన్ ముత్తాఖీ స్వయంగా తెలిపారు. పాక్‌కు చెందిన జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తమ పాలసీలో భాగంగా ఈ పనిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ చర్చల ఫలాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ చర్చలు అఫ్గానిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ సిరాజుద్దీన్ హక్కానీ ఆధ్వర్యంలో దాదాపు రెండు వారాలపాటు జరిగాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







