గిరిజన ఉత్పత్తులకు ఆదరణ కల్పించాలని సూచన:ఉపరాష్ట్రపతి

- November 15, 2021 , by Maagulf
గిరిజన ఉత్పత్తులకు ఆదరణ కల్పించాలని సూచన:ఉపరాష్ట్రపతి
బెంగళూరు: భారత స్వాతంత్ర్య సంగ్రామంలో గిరిజన తెగలకు చెందిన వీరులు చూపిన పోరాట పటిమ, త్యాగం నిరుపమానమని భారత ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గిరిజన స్వాతంత్ర్య యోధుడు బిర్సాముండా జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా బెంగళూరులోని రాజ్ భవన్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజనుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అంతకుముందు గిరిజన ఉత్పత్తులు, వారి కళారూపాలతో ఏర్పాటుచేసిన ప్రదర్శనను తిలకించారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ.. బిర్సాముండా జయంతిని జనజాతీయ గౌరవ్ దివస్ గా జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమన్నారు. బిర్సాముండా, రాణీ దుర్గావతి, రాణీ గైడిన్‌ల్యూ, బాబా తిల్కా మాఝీ, కొమురం భీం, రాంజీ గోండు వంటి వీరుల త్యాగాలను గుర్తుచేసుకునేందుకు మరో అవకాశం దొరికిందన్నారు.సంతల్, తామర్, కోల్, భిల్లు, ఖసి, మిజో వంటి వివిధ గిరిజన తెగల వీరులు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేశారని, వారి వీరోచిత పోరాటాన్ని తర్వాతి తరాలకు గుర్తుచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆంగ్లేయులతో పోరాటంలో రాణి దుర్గావతి తుది శ్వాస వరకు పోరాటం చేసి తన గోండ్వానా సామ్రాజ్యాన్ని కాపాడుకున్న తీరు, ఇలాంటి ఎన్నో సాహసోపేతమైన గాథలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు.గిరిజన ఉత్పత్తులు, వారి కళాకృతులు పర్యావరణానుకూలంగా ఉంటాయని, అలాంటి ఉత్పత్తులకు మరింత ఆదరణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com