ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాన్ ప్రాఫిట్ సిటీ ప్రకటన

- November 16, 2021 , by Maagulf
ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాన్ ప్రాఫిట్ సిటీ ప్రకటన

రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ప్రపంచంలోనే తొలి నాన్ ప్రాఫిట్ సిటీ ఏర్పాటుని ప్రకటించారు. ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాన్ ప్రాఫిట్ సిటీ, అంతర్జాతీయ స్థాయి ప్రత్యేకతలతో ఏర్పాటు కానుంది. యువ వాలంటీర్ గ్రూపులతో ఇన్‌క్యుబేటర్ తరహాలో ఇది వుండబతోంది. స్థానిక అలాగే అంతర్జాతీయ నాన్ ప్రాఫిట్ సంస్థలతో ఇది పనిచేస్తుంది. వెంచుర్ క్యాపిటల్ కంపెనీలు, ప్రపంచ వ్యాప్తంగా టాలెంట్‌ని ప్రోత్సహించే ఇన్వెస్టర్లకు ఇది ప్రోత్సాహకరంగా వుండబోతోంది. స్కూళ్ళు, కాన్ఫరెన్స్ సెంటర్, సైన్స్ మ్యూజియం, క్రియేటివ్ సెంటర్.. ఇలా చాలా ప్రత్యేకతలు వుండబోతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్్, ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) , రోబోటిక్స్ వంటివాటికి ప్రాధాన్యతలిస్తున్నట్లు ప్రిన్స్ మొహమ్మద్ చెప్పారు. 3.4 చదరపు కిలోమీటర్ల వైశ్యాలయంలో వాడి హనీఫా వద్ద ఈ సిటీ ఏర్పాటవుతుంది. థియేటర్, ఆర్ట్స్ అకాడమీ మరియు గ్యాలరీ అలాగే కుకింగ్ అకాడమీ మరియు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కూడా వుంటాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com