అజ్మాన్‌లో మొదటి డ్రైవర్‌లెస్ బస్సు ప్రారంభం

- November 17, 2021 , by Maagulf
అజ్మాన్‌లో మొదటి డ్రైవర్‌లెస్ బస్సు ప్రారంభం

యూఏఈ: మిడిల్ ఈస్ట్ రీజియన్‌లో మొదటి ఆపరేషనల్ డ్రైవర్‌లెస్ బస్సు మంగళవారం ఉదయం అజ్మాన్‌లో ప్రారంభమైంది.  అజ్మాన్ మునిసిపాలిటీ, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ షేక్ రషీద్ బిన్ హుమైద్ అల్ నుయిమి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాష్ట్ర మంత్రి ఒమర్ అల్ ఒలామా లు అజ్మాన్ కార్నిచ్‌లో ఈ బస్సు సర్వీసును ప్రారంభించి అందులో ప్రయాణించారు. ఈ బస్సులో అధిక పనితీరు గల సెన్సార్లను అమర్చారు. ఫుట్ క్రాసింగ్‌లు, ట్రాఫిక్ సిగ్నల్‌లను గుర్తించేందుకు 14 కెమెరాలు అమర్చినట్లు ఈ ప్రాజెక్ట్ కు బాధ్యత వహిస్తున్న ION ప్రాజెక్ట్ మేనేజర్ నాసిర్ అల్ షమ్సీ తెలిపారు. "ఇది దాదాపు 20 మీటర్ల దూరం నుండి క్రాసింగ్‌లు, సిగ్నల్‌లు గుర్తించగలదు. " అని అతను చెప్పాడు. ఈ డ్రైవర్ లెస్ బస్సులో 11 మంది ప్రయాణికులతో సహా మొత్తంగా 15 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. అజ్మాన్‌లో 3 కి.మీ. కార్నిచ్ రహదారిలోని క్రాసింగ్‌లు, సిగ్నల్ల దగ్గర బస్సులోని కెమెరాలు, సెన్సార్‌లకు ప్రతిస్పందించే సెన్సార్‌లను అమర్చినట్లు షమ్సీ వివరించారు. సమీప భవిష్యత్తులో బస్సు రన్నింగ్ దూరాన్ని 7కిలోమీటర్లకు పెంచే యోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు. మిడిల్ ఈస్ట్ లో మొట్టమొదటి డ్రైవర్‌లెస్ బస్సును ఫ్రెంచ్ కంపెనీ తయారు చేసిందని, అయితే బస్సులో వినియోగించిన టెక్నాలజీని  అభివృద్ధి చేయడంలో ఐఓఎన్‌లోని ఎమిరాటిస్ తన వంతు పాత్ర పోషించిందని అల్ షమ్సీ చెప్పారు. 2018లో మస్దర్ సిటీలో తొలిసారిగా బస్సును ట్రయల్ రన్ నిర్వహించామని అల్ షమ్సీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com