ట్రాఫిక్ రూల్స్ బేఖాతర్ చేస్తున్న ట్రక్ డ్రైవర్లు. ఆరు నెలల్లో 2,80,000 ట్రాఫిక్ చలానాలు
- November 17, 2021
కువైట్: ట్రాఫిక్ నిబంధనలను హెవీ ట్రక్ డ్రైవర్లు బేఖాతర్ చేస్తున్నారు. 2021 మొదటి ఆరు నెలల్లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన హెవీ డ్యూటీ ట్రక్కులకు 2,80,000 ట్రాఫిక్ చలానాలను విధించారు. వీటిల్లో అత్యధికంగా 2,75,108 'నో పార్కింగ్' జోన్లలో పార్కింగ్ ఉల్లంఘనలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్ మెంట్ తెలిపింది. ట్రాఫిక్ కదలికలను పర్యవేక్షించడంలో GTD ప్రభావవంతమైన పాత్రను పోషిస్తుందని... ప్రధాన, అంతర్గత రహదారులపై 24 గంటలు పర్యవేక్షించడంతోపాటు పార్కింగ్ నిబంధనల పట్ల ట్రక్కు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తుందని డిపార్ట్ మెంట్ వెల్లడించింది. ట్రక్కులకు అనువైన పార్కింగ్ స్థలాలను అందించడానికి ట్రాఫిక్ విభాగం సమన్వయం, సహకారంతో కువైట్ మునిసిపాలిటీతో కలిసి పనిచేస్తున్నట్లు పబ్లిక్ రిలేషన్స్ వర్గాలు స్పష్టం చేశాయి. పార్కింగ్ నిబంధనలను ఉల్లంఘిస్తే (నిర్దేశించిన ప్రదేశాలలో వాటిని పార్క్ చేయకపోతే) చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు