జాతీయ దినోత్సవం కోసం ముస్తాబైన ‘సలాలా’
- November 17, 2021
ఒమన్: ఒమన్ సుల్తానేట్ 51వ జాతీయ దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఇందు కోసం సన్నాహాలు మొదలయ్యాయి. సలాలా నగరం ఒమన్ జాతీయ రంగులతో వెలిగిపోతుంది. జాతీయ దినోత్సవ వేడుకల నేపథ్యంలో నగరాన్ని సర్వంగా సుందరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. జాతీయ దినోత్సవ సంబురాల కోసం ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఒమన్ సుల్తానేట్ గత 50 ఏళ్లలో చేసిన పోరాటాలు, సాధించిన విజయాలను గుర్తు చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ దినోత్సవ ఉత్సాహం ప్రతిచోటా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సందర్భాన్ని జరుపుకోవడానికి ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రతి వీధిలో ఒమన్ జాతీయ జెండా రెపరెపలాడుతోంది. జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కొన్ని పాఠశాలలు క్విజ్ పోటీలను నిర్వహించగా, మరికొన్నిచోట్ల ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా సమావేశాలు, సామాజిక దూరం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు