ఎంఎన్ సీ ఉద్యోగులకు మల్టీఫుల్ ఎంట్రీ పర్మిట్ వీసాలు

- November 17, 2021 , by Maagulf
ఎంఎన్ సీ ఉద్యోగులకు మల్టీఫుల్ ఎంట్రీ పర్మిట్ వీసాలు

దుబాయ్: మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఎమిరేట్ ఆఫ్ దుబాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి మల్టీఫుల్ ఎంట్రీ పర్మిట్ వీసాలను 5 ఏళ్ల కాలానికి ఇష్యూ చేయాలని నిర్ణయించింది. దీంతో ఇంటర్నేషనల్ కంపెనీల్లో పనిచేసే వారు ఐదేళ్ల పాటు ఎమిరేట్ ఆఫ్ దుబాయ్ లో ఉండే అవకాశం ఉంటుంది. వారికి వీసా కూడా సులభంగా లభిస్తుంది. పని చేసుకునే వాతావారణం కల్పించటంతో పాటు విదేశీ పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనను పెంచేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. చాలా కంపెనీలకు కూడా తమ బిజినెస్ ను పెంచుకునేందుకు నాణ్యమైన మానవ వనరులను నియమించుకునేందుకు ఇది చక్కని అవకాశమని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా ప్రపంచంలోనే పని వాతావారణం  అద్భుతంగా ఉండే బెస్ట్ సిటీల్లో దుబాయ్ ను నంబర్ వన్ చేయటమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com