ఎంఎన్ సీ ఉద్యోగులకు మల్టీఫుల్ ఎంట్రీ పర్మిట్ వీసాలు
- November 17, 2021
దుబాయ్: మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఎమిరేట్ ఆఫ్ దుబాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి మల్టీఫుల్ ఎంట్రీ పర్మిట్ వీసాలను 5 ఏళ్ల కాలానికి ఇష్యూ చేయాలని నిర్ణయించింది. దీంతో ఇంటర్నేషనల్ కంపెనీల్లో పనిచేసే వారు ఐదేళ్ల పాటు ఎమిరేట్ ఆఫ్ దుబాయ్ లో ఉండే అవకాశం ఉంటుంది. వారికి వీసా కూడా సులభంగా లభిస్తుంది. పని చేసుకునే వాతావారణం కల్పించటంతో పాటు విదేశీ పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పనను పెంచేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. చాలా కంపెనీలకు కూడా తమ బిజినెస్ ను పెంచుకునేందుకు నాణ్యమైన మానవ వనరులను నియమించుకునేందుకు ఇది చక్కని అవకాశమని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. అదే విధంగా ప్రపంచంలోనే పని వాతావారణం అద్భుతంగా ఉండే బెస్ట్ సిటీల్లో దుబాయ్ ను నంబర్ వన్ చేయటమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?