జనవరిలో 5-11 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్
- November 17, 2021
ఖతార్: ఖతార్ లో 5 నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులకు జనవరిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుకానుంది. ఈ విషయాన్ని ఖతార్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. పేరెంట్స్ అంతా తప్పకుండా పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని ప్రభుత్వం కోరింది. వ్యాక్సిన్ చేయించుకున్న వారితో పోల్చితే ఈ ఏజ్ గ్రూప్ లో వ్యాక్సిన్ చేయించుకొని వారి పై కరోనా ఎఫెక్ట్ ఉన్నట్లు చాలా స్టడీస్ లో తేలింది. వ్యాక్సిన్ వేసుకొని పిల్లల్లో 63 శాతం మందికి మైనర్ కరోనా లక్షణాలు వస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రభావం పిల్లలపై ఉండకూడదంటే అందరికీ వ్యాక్సిన్ వేయించాలని హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. పెద్దలకు 30 మైక్రో గ్రామ్స్ డోస్ ఉంటే పిల్లలకు మాత్రం 10 మైక్రో గ్రామ్స్ డోస్ ఇస్తున్నారు. మూడు వారాల వ్యవధిలో వీరికి రెండు డోస్ ల వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదని..ఇది పక్కా సేఫ్ అని అధికారులు స్పష్టం చేశారు. 1440 మంది పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చి రెండు నెలల పాటు అబ్జర్వేషన్ లో పెట్టామని వారికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?