షార్జాలో ప్లాంట్ ను ప్రారంభించిన మొదటి ఇండియన్ చమురు సంస్థ

- November 18, 2021 , by Maagulf
షార్జాలో ప్లాంట్ ను ప్రారంభించిన మొదటి ఇండియన్ చమురు సంస్థ

షార్జా:  షార్జాలో ఇండియన్ చమురు సంస్థ అయిన సిద్ధార్థ్ గ్రీస్ అండ్ లూబ్స్ వాళ్ల సబ్సిడరీ ట్రినిటి లూబ్స్ అండ్ గ్రీస్ తన ప్లాంట్ ను ప్రారంభించింది. షార్జాలోని  హమరియా ఫ్రీ జోన్ అథారిటీ పోర్ట్ లో దీన్ని ఏర్పాటు చేశారు. భారత పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి ఈ ప్లాంట్ ను ఓపెన్ చేశారు. షార్జా లో భారత్ కు చెందిన చమురు ప్లాంట్ ను ప్రారంభించటం ఇదే తొలిసారి కావటం విశేషం. దాదాపు 50 మిలియన్ల దిర్హామ్స్ ను  ప్లాంట్ ఏర్పాటు కోసం ఇన్వెస్ట్ చేశారు. మొత్తం 12, 500 స్క్వేర్ మీటర్ల పరిధిలో ఉన్న ఈ ప్లాంట్ లో ఏటా 50 మిలియన్ల లీటర్ల గ్రీస్, చమురును ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ పూర్తిగా ఆటోమేటేడ్. ఆటోమెబైల్, ఇండస్ట్రీస్ కావాల్సిన చమురుతో పాటు ఎలక్టిక్ వెహికల్స్ అవసరమైన ఆయిల్ ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com