60 ఏళ్లు దాటిన వారికి ఆప్షన్.. యువతకు అవకాశం..!

- November 18, 2021 , by Maagulf
60 ఏళ్లు దాటిన వారికి ఆప్షన్.. యువతకు అవకాశం..!

కువైట్: 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అధికారులు పదవీ విరమణ కోసం దరఖాస్తులను సమర్పించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశించింది.  ఇప్పటికే వివిధ ర్యాంక్‌లకు చెందిన 200 మంది అధికారులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దరఖాస్తులను సమర్పించారు. పదవీ విరమణ, సర్వీస్ పొడిగింపు  కోసం వాటిని మంత్రిత్వ శాఖ కార్యాలయానికి రిఫర్ చేయనున్నారు. “ఈ విధానం మధ్య స్థాయి అధికారులను ఉన్నత స్థానాలకు పదోన్నతి పొందేందుకు అనుమతిస్తుంది. అలాగే కొంతమంది సీనియర్ అధికారులకు రిటైర్మెంట్ ఇవ్వడం ద్వారా యువ రక్తానికి చోటు కల్పించాలి.  ప్రత్యేకించి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పునర్నిర్మాణానికి ఇది అవసరం. అదే విధంగా కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సాంకేతిక అభివృద్ధిని వివిధ స్థాయుల్లో కొత్త వారికి అవకాశం కల్పించాలి.’’ అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఓ అధికారి తెలిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com