వీసీ ఆఫీస్ ధ్వంసం..
- March 22, 2016
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు నేడు క్యాంపస్‌కు తిరిగివచ్చారు. అప్పారావు వాహనంపై విద్యార్థి సంఘాలు దాడి చేశాయి. ఆయన కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, వసతి గృహం అద్దాలను పగులగొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో హెచ్‌సీయూలో పోలీసులు భారీగా మోహరించారు. అధ్యాపకులను గదిలో బంధించి బయట గడియ పెట్టారు. ఇక మీడియా ప్రతినిధులపై కూడా విద్యార్థులు దాడి చేశారు. వీసీ అప్పారావుకు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన అప్పారావు మళ్లీ వీసీగా బాధ్యతలు స్వీకరించడంపై విద్యార్థులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.=అప్పారావుకు వ్యతిరేక, అనుకూల వర్గాల విద్యార్థుల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అధ్యాపకులు కూడా రెండు వర్గాలు చీలిపోయినట్లు సమాచారం. వీసీ అప్పారావుకు ఏబీవీపీ విద్యార్థులు మద్దతిస్తున్నట్లు సమాచారం. రోహిత్ తో పాటు మరో నలుగురి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు అప్పారావును వర్సిటీలోకి రానివ్వమని వ్యతిరేక వర్గం విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. అప్పారావు వీసీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన చాంబర్ ను ధ్వంసం చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







