కేవలం రెండురోజుల్లో పర్మిషన్...
- March 22, 2016
షూటింగులకు పర్మిషన్ తీసుకోవాలంటే రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అప్లై చేసిన 48 గంటల్లోనే ఎంచక్కా షూటింగ్ చేసుకోవచ్చు.. దీనివల్ల నిర్మాతకు భారం తగ్గనుంది. సకాలంలో ఎక్కువ సినిమాలు థియేటర్స్ వచ్చే ఛాన్స్ వుంది. అధికారుల నుంచి అనుమతి వచ్చేసరికి ఒక్కోసారి నెలరోజుల సైతం పట్టేంది.. ఆ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం సడలించింది. ఫిల్మ్ ఇండస్ర్టీ డెవలప్మెంట్పై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయాలు తీసుకుంది. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, తుమ్మల, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, చలన చిత్ర ప్రముఖులు దాసరి నారాయణరావు, సురేష్‌బాబు, మురళీమోహన్, ఆదిశేషగిరిరావు, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజలు పాల్గొన్నారు.ఇకపై పోలీసు, పర్యాటక, అటవీ, పురపాలక, పురావస్తు శాఖల పరిధిలో షూటింగుల కోసం ఎఫ్డీసీకి దరఖాస్తు చేసుకుంటే.. 48 గంటల్లో అనుమతులు ఇవ్వాలని ఉపసంఘం కోరింది. అలాగే చిన్న చిత్రాల కోసం ప్రతీ థియేటర్లో ఐదు షోలను ప్రదర్శించేందుకు అనుమతించాలని తెలిపింది. ప్రతీరోజు సాయంత్రం నాలుగు గంటలకు దీనిని ప్రదర్శించనున్నారు. మరోవైపు పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ తరహాలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కు స్థల సేకరణ, నిర్మాణ విధివిధానాల రూపకల్పనకు ఉప కమిటీ ఏర్పాటైంది. టాలీవుడ్‌కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాతలకు ఎంతో మేలు కలుగుతుందని ఇండస్ర్టీ భావిస్తోంది. తమ సినిమాల నిర్మాణానికి ఇది మంచి అవకాశమని చెప్పుకుంటున్నారు. కేవలం రెండురోజుల్లో పర్మిషన్ అంటే మాటలుకాదని, ఇప్పుడు అసాధ్యం సుసాధ్యమైందని నిర్మాతల మండలి భావిస్తోంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







