వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరించనున్న బ్రిటన్ !

- November 20, 2021 , by Maagulf
వింటర్ ఒలింపిక్స్ ను బహిష్కరించనున్న బ్రిటన్ !

లండన్‌: చైనా రాజధాని బీజింగ్‌లో వచ్చే ఏడాది జరగనున్న శీతాకాల ఒలింపిక్స్‌ను బ్రిటన్‌ బహిష్కరించే అవకాశం కనిపిస్తున్నది. మానవ హక్కులను చైనా కాలరాస్తున్నదని అందువల్ల దౌత్యపరంగా వింటర్ ఒలింపిక్స్‌ను బహిష్కరించే అంశాన్ని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పరిశీలిస్తున్నారని స్థానిక వార్తా పత్రికలు తెలిపాయి.

ఒలింపిక్స్‌ బాయ్‌కాట్‌ దిశగా తగిన నిర్ణయం తీసుకుంటామని యూకే విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌ పేర్కొన్నారు. కాగా, బ్రిటన్‌ మంత్రులతోపాటు, చైనాలో యూకే రాయబారి కూడా విశ్వ క్రీడల వేడుకల్లో పాల్గొనకూడదనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌కు బీజింగ్‌ ఆతిథ్యమివ్వనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com