చంద్రబాబు భావోద్వేగం...మెడలు విరిచేస్తానంటూ మండిపడ్డ బాలయ్య...
- November 20, 2021
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి అధికార వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నందమూరి కుటుంబం భగ్గుమంది.
భువనేశ్వరి సోదరుడు, వియ్యంకుడు కూడా అయిన హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ వివాదంపై తొలిసారి స్పందించారు. మా అక్క జోలికి ఇంకోసారి వస్తే మెడలు విరిచేస్తానంటూ వైసీపీకి బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. నందమూరి కుటుంబానికి చెందిన ఇతర సభ్యులతో బాలయ్య శనివారం తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో పరిణామాలు, అధికార వైసీపీ పోకడలపై బాలయ్య స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు..
ఏపీ అసెంబ్లీలో శుక్రవారం నాడు వ్యవసాయ రంగంపై చర్చ సందర్బంగా టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం, వివేకా హత్యను సీఎం జగన్ కు ఆపాదిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేయగా, దివంగత మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మృతిని ప్రస్తావిస్తూ వైసీపీ నేతలు ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో ఓ వైసీపీ ఎమ్మెల్యే.. నారా లోకేశ్ పుట్టుకపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది విన్న చంద్రబాబు.. పట్టలేని ఆక్రోషంతో వైసీపీపై ఆగ్రహం వెళ్లగక్కుతూ సభ నుంచి బయటికొచ్చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లోనూ చంద్రబాబు కన్నీరుమున్నీరుగా విలపిపిస్తూ.. తన భార్యపై వైసీపీ నేతలు దిగజారుడు కామెంట్లు చేశారని, స్పీకర్ సైతం ఉదాసీనంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఘటనపై..
చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో తమ తప్పేది లేదని అధికార వైసీపీ నేతలు వాదిస్తుండగా, నందమూరి కుటుంబం మాత్రం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. బాలయ్య నేతృత్వంలో కుటుంబీకులు శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు.
అసెంబ్లీ వ్యక్తిగత దూషణలకు వేదిక అయిందని, ఎంతో ధైర్యంగా పోరాడే చంద్రబాబు.. కన్నీరు పెట్టడం ఏనాడూ చూడలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. అసెంబ్లీలో వ్యక్తులు, వ్యక్తిత్వాలను కించపరిచేలా అధికార వైసీపీ నేతలు ప్రవర్తించారని, వ్యక్తిత్వ హననానికి పాలుపడ్డారని ఆయన మండిపడ్డారు. 'ఇకపై నోరు జారితే ఎవరినీ ఉపేక్షించం. ఇక్కడ ఎవరూ చేతులుక ట్టుకుని కూర్చోలేదు. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. ఇంకోసారి ఇలా మాట్లాడితే.. ఖబర్దార్.. నోరు అదుపులో పెట్టుకోండి.. 'అంటూ బాలయ్య.. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు..
తాజా వార్తలు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!
- ఖతార్ లో రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్టాక్స్ డెలివరీ..!!
- ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమానికి హాజరైన సీఎం









