2017 నాటికి ట్రయల్ మరియు టెస్టింగ్: దోహా మెట్రో రైల్
- March 22, 2016
దోహా మెట్రో రైల్‌కి సంబంధించి ట్రయల్, టెస్టింగ్ 2017 చివరి నాటికి జరగవచ్చని ఖతార్ రైల్ సీనియర్ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి మెట్రో రైల్ కోచ్‌లు దిగుమతయ్యే అవకాశం ఉందని ఖతార్ రైల్ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్లా అబ్దుల్ అజీజ్ అల్ సబాయి చెప్పారు. 40 స్టేషన్లతో 108 కిలోమీటర్ల మేర తొలి ఫేజ్‌ని 2019 చివరి నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నార్తరన్ సెక్షన్‌లోని 42 కిలోమీటర్ల మేర లాంగ్ రెడ్ లైన్ టన్నెలింగ్ వర్క్ పూర్తయ్యిందనీ, వీలైనంత వేగంగా మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్ పనుల్ని చేపడ్తామని అన్నారు. మొత్తం కాంట్రాక్టుల్లో 70 శాతం లోకల్ కాంట్రాక్టర్ల చేతుల్లోనే ఉన్నాయనీ, పనులు శరవేగంగా జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. దోహా మెట్రో ప్రాజెక్ట్ కోసం 21 టన్నెల్ బోరింగ్ మెషీన్లను వినియోగిస్తుండడం గిన్నీ వరల్డ్ రికార్డ్‌గా అధికారులు అభివర్ణించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







