ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్: ఫ్రీ ఫుడ్
- March 22, 2016
ఇండియాకి చెందిన బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, యూఏఈకి మరిన్ని విమానాల్ని నడపాలనుకుంటోంది. యూఏఈ నుంచి ముంబై మరియు ఢిల్లీకి ప్రయాణించే విమానాల సంఖ్యను రెండింతలకు పెంచాలన్నది ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఆలోచన. వారానికి మొత్తం 107 విమానాలు నడుస్తుండగా, వాటి సంఖ్యను 146కి పెంచాలనుకుంటున్నారు. వారానికి రెండుసార్లు ముంబైకి మరియు ఢిల్లీకి నడిచే విమాన సర్వీసు వచ్చే నెలలో ప్రారంభం కానుంది. గతంలో విమానాల రద్దు కారణంగా ప్రయాణీకుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. ఇండియాలోని 12 ప్రముఖ నగరాల్ని యూఏఈలోని నాలుగు ఎమిరేట్స్‌తో కలిపేందుకు కొత్తగా బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌ని లీజ్‌కి తీసుకుందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.శ్యామ్‌సుందర్ చెప్పారు. దుబాయ్ - ముంబై, షార్జా - ముంబై రోజువారీ విమానాలు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ - అబుదాబీ, ఢిల్లీ - దుబాయ్ సర్వీసులు మే 15, మే 16న ప్రారంభమవుతాయి. కేరళ సెక్టార్‌కి సంబంధించినంతవరకు వారానికి 96 విమానాల నుంచి 119 విమానాలకు పెంచనున్నారు. తమ విమానాల్లో ఆన్‌లైన్ ద్వారా ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







