బ్రస్సెల్స్ లో జంటబాంబు పేలుళ్లు
- March 22, 2016
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో జంటబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. రాజధానిలోని ప్రముఖ విమానాశ్రయం జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి భవన అద్దాలన్ని బద్ధలయ్యాయి. ఈ ఘటనలో పదకొండుమంది చనిపోగా 22 మంది గాయాలపాలయినట్లు తెలుస్తోంది. వందమందికి పైగా ఈపేలుడు భారిన పడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎయిర్ పోర్ట్ లో ఉన్నవారంతా భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు.అయితే, పేలుళ్లకు గల కారణాలు, నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే, పేలుళ్లకు ముందు అరబిక్ భాషలో పెద్దగా అరుపులు వినిపించాయని, కాల్పులు కూడా సంభవించాయని కొంతమంది చెప్తున్నారు.టెర్మినల్స్ భవంతుల నుంచి మాత్రం పెద్ద మొత్తంలో పొగ వెలువడుతోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం కొంత అనుమానానికి తావిస్తోంది. తమ వ్యక్తిని అరెస్టు చేశారన్న కోపంతో ప్రతికార దాడులు చేశారని అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేసి ప్రయాణికులను తరలిస్తున్నారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







