స్కూల్ బస్సెస్ స్టాప్ సిగ్నల్స్ పట్టించుకోని 492 మంది వాహనాదారులకు ఫైన్

- November 22, 2021 , by Maagulf
స్కూల్ బస్సెస్ స్టాప్ సిగ్నల్స్ పట్టించుకోని 492 మంది వాహనాదారులకు ఫైన్

అబుధాబి: స్కూల్ పిల్లలు ప్రయాణించే బస్సులకు సంబంధించిన ప్రభుత్వం ఎంత కేర్ తీసుకుంటుందో తెలిసిందే. స్కూల్ పిల్లలు ఉన్న బస్సు స్టాప్ సిగ్నల్ చూపిస్తే వాహనాదారులు 500 మీటర్ల ముందే ఆగాల్సి ఉంటుంది. కానీ చాలా మంది డ్రైవర్లు ఇది లెక్క చేయటం లేదు. స్కూల్ పిల్లలున్న బస్సు సమీపంలో కూడా రాష్ గా డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి వారిపై ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి 492 మంది వాహనాదారులకు ఫైన్లు వేశారు. ఒక్కొక్కరికి 1000 దిర్హామ్స్ ఫైన్ తో పాటు 10 బ్లాక్ పాయింట్లు రిజిస్టర్ చేశారు. అదే విధంగా బస్సు డ్రైవర్లకు కూడా కచ్చితంగా స్టాప్ బోర్డును చూపించాలని ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేశారు. లేదంటే 600 దిర్హామ్స్ ఫైన్ వేస్తామని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com