రెగ్యులర్ షూటింగ్‌లో ఆది సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్
- November 22, 2021
హైదరాబాద్: చాగంటి ప్రొడక్షన్లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. విజయదశమి పండుగ సందర్భంగా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ కోకాపేట లోని ఒక ప్రవేట్ హౌస్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. హీరో ఆది సాయికుమార్ హీరోయిన్ మిషా నారంగ్, నటుడు భూపాల్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు దర్శకుడు శివశంకర్ దేవ్. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ కథతో శివశంకర్ దేవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అజయ్ శ్రీనివాస్ నిర్మాత. కొత్త కాన్సెప్ట్, సరికొత్త కథనం ఆది సాయికుమార్ ఇప్పటివరకు చేయని పాత్రతో సినిమా ఉంటుందని యూనిట్ చెబుతున్నారు. నటీ నటులు - ఆదిసాయికుమార్, మిషా నారంగ్, అలీ రాజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప , వసంతి తదితరులు సాంకేతిక వర్గం - సినిమాటోగ్రఫీ, జిశేఖర్, మ్యూజిక్: అనీష్ సోలోమాన్ పిఆర్ఒః జియస్ కె మీడియా, నిర్మాతః అజయ్ శ్రీనివాస్ దర్శకుడు : శివశంకర్ దేవ్.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్